
మండలంలోని సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2024 -25 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 9 తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పెద్ద కోడపగల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నళిని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు www trwreir.ac.in వెబ్సైట్ ద్వారా ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని ,ఏప్రిల్ 21న BLV సెట్ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు . ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు.