నవోదయలో ఖాళీ సీట్లకు భర్తీలకి ఆహ్వానం 

Invitation for replacements for vacant seats in Navodayaనవతెలంగాణ – నిజాంసాగర్

మండల కేంద్రంలోని జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ఖాళీల భర్తీలకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ప్రవేశ పరీక్ష 8 ఫిబ్రవరి 2025న నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. దరఖాస్తు కోసం https://navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె అన్నారు.