ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో 6వ తరగతి ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇందల్వాయి – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రధానాచార్యులు రమేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశాలకు ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతిలో బాలికలకు 30 సీట్లు, బాలురకు 30 సీట్లు ఖాలీలు ఉన్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు https://tsemrs.telangana.gov.in లింక్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.