అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాజంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారి నుంచి అవార్డుల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య జాతీయ కార్యదర్శి డా.గణగళ్ళ విజరుకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్తున్న అవార్డులకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సమాజ సేవ, విధి నిర్వహణ, సాహిత్యం, నృత్యం, ఆధ్యాత్మికం, చిత్రలేఖనం, జనరల్‌ నాలెడ్జ్‌, క్రీడలు, శాస్త్రీయ సంగీతం (నాదస్వరం,డోలు,శాక్సోఫోన్‌), ఉపాధికల్పన, తదితర రంగాల్లో అవార్డులను అందజేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి గలవారు అక్టోబర్‌ 2లోగా వాట్సాప్‌ నెంబర్‌ 9391379903 నెంబర్‌కు తమ వివరాలను ఆధారాలతో పంపించాల్సిందిగా కోరారు.