నవతెలంగాణ – మద్నూర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్, అలాగే బిచ్కుంద, కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే .అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు. బిచ్కుంద డిగ్రీ కళాశాలలో ఆంగ్లం-1 మరియు అర్థశాస్త్రం-1 ఖాళీలు ఉండగా .మద్నూర్ డిగ్రీ కళాశాలలో తెలుగు -1, ఆంగ్లం-1, బాటని-1, జువాలజీ-1, కెమిస్ట్రీ-1 ఖాళీలు. ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55% మార్కులు అర్హత కలిగి ఉండాలి. నెట్,సెట్,పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యతఇవ్వబడుననీ తెలిపారు విద్య అర్హత పత్రాలు ఈనెల 27వ తారీకు అనగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమర్పించగలరనీ ప్రిన్సిపాల్ తెలిపారు అర్హత కలిగిన వారు అతిథి అధ్యాపకుల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.