2024-25 సంవత్సరమునకు గాను గ్రూప్స్, యస్.యస్.సి., ఆర్.ఆర్.బి., బ్యాంకింగ్, తదితర రాష్ట్ర, కేంద్ర స్థాయి ఉద్యోగాల కోసం టిఎస్ ఎస్ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఫౌండేషన్ కోర్స్ ద్వారా మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ది అధికారి, యం. జయపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు స్థానికంగా ఉన్న స్టడీ సర్కిల్ యాదాద్రి భువనగిరిలో స్పాట్ అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందన్నారు. అభ్యర్ధులు డిగ్రీ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9492363910 నంబరును సంప్రదించాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు తమ కులము, ఆదాయము, పదవతరగతి మెమో, డిగ్రీ సర్టిఫికెట్స్, ఆధార కార్డు మరియు పాస్ పోర్ట్ సైజు పోతోలతో స్పాట్ అడ్మిషన్లకు రావాలన్నారు.