నవతెలంగాణ – భువనగిరి రూరల్
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్సి స్టడీ సర్కిల్స్‌లో గ్రూప్-వన్, బ్యాంకింగ్ , అర్ అర్ బి , యస్ యస్ సి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చే భర్తీ చేయబడే ఇతర ఉద్యోగాల పోటీపరీక్షల శిక్షణ కొరకు నోటిఫికేషన్ గడువు మార్చి ఆరవ తేదీతో ముగియనుందని తెలిపారు.
యాదాద్రి- భువనగిరి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అని నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ స్టడీ సర్కిల్లలో ప్రవేశానికై ఎంపిక, పోటీ పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. స్టడీ సర్కిల్ వెబ్సైట్ http://tsstudycircle.co.in/ నందు దరఖాస్తు చేసుకొనవచ్చును. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ మార్చి 6, 2024. పరీక్ష యొక్క హాల్ టికెట్లు మార్చి 7వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. పోటీ పరీక్ష మార్చి 10, 2024 నాడు ఉదయం 11.00 గంటలు నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు శిక్షణ మార్చి 18, 2024 నుంచి మొదలై ఆగస్టు 17, 2024 న ముగుస్తుందని తెలిపారు. యస్.సి., యస్.టి., బి.సి (మైనారిటీలతో సహా) కులాలకు చెందిన, నలభై నాలుగేళ్ళలోపు వయసు కలిగిన, డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులైన, సంవత్సరానికి మూడులక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశపరీక్షకై దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కులం సర్టిఫికెట్, ఒక సంవత్సరం నిండనటువంటి ఆదాయం సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, వయసును తెలిపే పదో తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, అంగవైకల్యం సర్టిఫికెట్ (వర్తించేవారికి మాత్రమే) లను సిద్ధం చేసుకుని స్టడీ సర్కిల్ jnవెబ్సైట్ http://.tsscstudycircle.co.in/ నందు అప్లై చేసుకోవాల్సిందిగా నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. పూర్తి వివరాలకు 8465035932, 9603167257, 9010895239 నెంబర్లను సంప్రదించాలని కోరారు.