ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఎస్ బి ఐ డిచ్ పల్లి  ఆధ్వర్యంలో  త్వరలో  ప్రారంభమయ్యే  శిక్షణలకు ధరఖస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మగ్గం వర్క్, మహిళలకు ఉచిత టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్ మెంట్, జూట్ బ్యాగుల మేకింగ్, ఆర్టిఫీషియల్ జ్యూవెలరీలలో ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఆసక్తి గల 19 నుండి 45 సంవత్సరల వయస్సు కలిగి ఉండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల  గ్రామీణ ప్రాంత యువతులు వచ్చి శిక్షణలో చేరాల్సిందిగా సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ పేర్కొన్నారు. శిక్షణా సమయం లో  భోజనం, హాస్టల్, తో పాటు శిక్షణా పూర్తిగా ఉచితంగా అందజేస్తామని,  శిక్షణా అనంతరం ధృవీకరణ పత్రం, టూల్ కిట్ కూడా అందజేస్తామని  వివరించారు. చిరునామా ట్రైజం సెంటర్ క్యాంపస్, వెలుగు ఆఫీస్ పక్కన డిచ్ పల్లి ఫోన్ నెంబర్ 08461-295428.