అతిథి మహిళా అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం..

Invitation for applications for guest female faculty.నవతెలంగాణ – చేర్యాల 
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్, నర్సింగ్ బోధించేందుకు అతిథి మహిళా అధ్యాపకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు కస్తూర్బా గాంధీ కళాశాల ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి తెలిపారు. కళాశాలలో మంగళవారం కృష్ణవేణి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ బోధించేందుకు పీజీ,బీఈడీ,నర్సింగ్ బోధించేందుకు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 4 నుంచి 9 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో సంబంధిత సర్టిఫికెట్స్,ఆధార్,ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేతనం నెలకు రూ.23 వేలు అందిస్తారని, ఈ విద్యాసంవత్సరం పరీక్షల వరకు మాత్రమే పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.