నవతెలంగాణ- డిచ్ పల్లి:స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ అధ్వర్యంలో రెండేళ్ల కు మేస్ కాంట్రాక్ట్ కోసం ఆసక్తి గల వ్యక్తుల నుండి టెండర్ లను అహ్వానిస్తున్నట్లు ఎస్ బిఐ అర్ఎస్ఈటిఐ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.23.11 మధ్యాహ్నం 2 గంటల వరకు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఎస్బిఐ అర్ఎస్ఈటిఐ డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ లో టెండర్లు వేయవచ్చని, 24.11 ఉదయం 10 గంటలకు టెండర్ తియడం జరుగుతుందని అయన వివరించారు. మిగిలిన
వివరాలకు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఎస్బిఐ అర్ఎస్ఈటిఐ డైరెక్టర్ ను సంప్రదించాలని కోరారు.