మైనార్టీ గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ విద్యాసంవత్సరం 2024 – 2025 కు గాను తెలంగాణ మైనార్టీ గురుకుల అశ్వారావుపేట పాఠశాల, కళాశాలలో కాళీ గా ఉన్న తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.సంగీత తెలిపారు.బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ పాఠశాలలో 5 నుండి 8 వరకు,ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం లలో చేరేందుకు ఆన్లైన్లో జనవరి 18 నుండి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు చేసుకోవాలని లేదా నేరుగా సంబంధిత పాఠశాల,కళాశాలలో దరఖాస్తులు అందించాలన్నారు. పూర్తి వివరాలకు 7995057877 నెంబర్ ను సంప్రదించాలని అన్నారు. వీటితో పాటు జూనియర్ కళాశాలలో ఇంటర్ తో పాటు ఎంసెట్,జేఈఈ మెయిన్స్,నీట్ ల కు కోచింగ్ ఇవ్వటం జరుగుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.