నేషనల్ ఓవర్సీస్  స్కాలర్షిప్ స్కీమ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం..

– ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి..
– జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణన్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గిరిజన అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం కోసం అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణన్  శుక్రవారం ప్రకటనలో తెలిపారు.  2024-25 సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మాస్టర్స్, పి.హెచ్.డి, రీసెర్చ్ ప్రోగ్రాం కోసం విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం  ఎన్ఓఎస్ స్కాలర్షిప్ అందిస్తుందనీ,  ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31 తేదీలోపు https://overseas.tribal.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.