ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

– అపరాధ రుసుం లేకుండా ఈ నెల 10 వరకు గడువు 
నవతెలంగాణ -పెద్దవంగర:
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)ద్వారా ఓపెన్ ఎస్‌ఎస్‌స్సీ, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ మండల కో ఆర్డినేటర్ అర్రోజు విజయకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ద్వారా తెలిపారు. ప్రవేశాల కోసం ఈ నెల 10 వ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లు పొందవచ్చునని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఓపెన్ పాఠశాలలో అడ్మిషన్ల కోసం 9490452794, 7013028163 లకు సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.