– జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధుల, వికలాంగుల శాఖ అధికారి నర్సింహారావు…
నవ తెలంగాణ భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని దివ్యాంగులైన విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వము వారు 2024-25 సంవత్సరమునకు గాను ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కై 1 నుండి 10వ తరగతి చదువుచున్న దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులు , పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కై ఇంటర్ , ఆపైన చదువుచున్న అధర్ క్యాస్ట్ దివ్యాంగ విద్యార్థులు రెన్యువల్ కొరకు, కొత్తగా స్కాలర్షిప్స్ కొరకు వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వయోవృద్ధుల వికలాంగుల శాఖ అధికారి నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. జనవరి 31వ తేదీ తేదీలోపు https://tgepass.cgg.gov.in నందు నమోదు చేసుకొని, జిల్లా అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు.