కాలేజీల గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం

– ఆన్‌లైన్‌లో సమర్పణ గడువు మార్చి 31
– ఆలస్య రుసుంతో మే 5 వరకు అవకాశం
– ఇంటర్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్‌ కాలేజీల నుంచి 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు పునరుద్ధరణ, అదనపు తరగతి గదుల అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. గుర్తింపు కోసం దరఖాస్తుల సమర్పణ గడువు వచ్చేనెల 31 వరకు ఉందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.వెయ్యితో ఏప్రిల్‌ ఏడు వరకు, రూ.ఐదు వేలతో 14 వరకు, రూ.10 వేలతో 21 వరకు, రూ.15 వేలతో అదేనెల 28 వరకు, రూ.20 వేలతో మే ఐదో తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశముందని వివరించారు. తనిఖీ ఫీజు మున్సిపల్‌ కార్పొరేషన్లలో రూ.65 వేలు, మున్సిపాల్టీల్లో రూ.50 వేలు, గ్రామ పంచాయతీల్లో రూ.20 వేలు, ఐదు కాలేజీల కంటే ఎక్కువున్న యాజమాన్యాలు మున్సిపల్‌ కార్పొరేషన్లలో రూ.75 వేలు, మున్సిపాల్టీల్లో రూ.62,500, గ్రామపంచాయతీల్లో రూ.25 వేలు చెల్లించాలని కోరారు. అనుబంధ గుర్తింపు ఫీజు మున్సిపల్‌ కార్పొరేషన్లలో రూ.16 వేలు, మున్సిపాల్టీల్లో రూ.14 వేలు, గ్రామపంచాయతీల్లో రూ.ఐదు వేలు కట్టాలని వివరించారు. ఐదు కాలేజీల కంటే ఎక్కువుంటే గుర్తింపు ఫీజు మున్సిపల్‌ కార్పొరేషన్లలో రూ.20 వేలు, మున్సిపాల్టీల్లో రూ.15 వేలు, గ్రామపంచాయతీల్లో రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు. ఒకేషనల్‌ కాలేజీలు తనిఖీ ఫీజు మున్సిపల్‌ కార్పొరేషన్లలో రూ.60 వేలు, మున్సిపాల్టీల్లో రూ.36 వేలు, గ్రామపంచాయతీల్లో రూ.16 వేలు కట్టాలని కోరారు. అనుబంధ గుర్తింపు ఫీజు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో రూ.ఐదు వేలు చెల్లించాలని పేర్కొన్నారు. వాటికి అదనంగా స్టేట్‌ జీఎస్సీ తొమ్మిది శాతం, సెంటల్‌ జీఎస్టీ తొమ్మిది శాతం కలిపి మొత్తం 18 శాతం జీఎస్టీని చెల్లించాలని తెలిపారు. బిల్డింగ్‌ ఓనర్‌షిప్‌/కాలేజీ భవనానికి సంబంధించిన రిజిస్టర్డ్‌ లీజ్‌ డీడ్‌ (ఆర్‌ఎల్‌డీ), ఆమోదించిన భవన ప్రణాళిక (కాలేజీ షిఫ్ట్‌ అయితే), ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌/ ఫైర్‌ ఓన్‌వోసీ, ఎఫ్‌డీఆర్‌ (కార్పస్‌ఫండ్‌), స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికెట్‌, శానిటరీ సర్టిఫికెట్‌, బోధనా సిబ్బంది ధ్రువపత్రాలు, ఆటస్థలం పత్రం వంటిని తప్పనిసరిగా దరఖాస్తుతోపాటు జతపర్చాలని సూచించారు. కాలేజీ యాజమాన్యాలు ్‌రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ లేదా aషaస్‌రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్లను సంప్రదించాలని కోరారు.