నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్, డోంగ్లి, ఉమ్మడి మండలంలో కొత్తగా పట్టాదారు పుస్తకం పొంది ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ 28-06-2024 కి పూర్తి చేసుకొన్న ఆర్ఓ ఎఫ్ఆర్ పట్టాలు/ సాధారణ పట్టాలు పొందిన 18 నుంచి 59 ఏళ్లు వయసు ఉన్న రైతులు రైతు బీమా పథకాని కి దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డులో వయసు 14-08-1965 నుండి 14-08-2006 మధ్య వున్న రైతులు అర్హులు అని ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి రాజు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు, దరఖాస్తుకు కావలిసిన పత్రాలు:
1. రైతు పట్టా పాస్ పుస్తకం,
2. ఆధార్ కార్డు జిరాక్స్
3. నామిని ఆధార్ కార్డు జిరాక్స్
4. రైతు బీమా దరఖాస్తు ఫారం,
దరఖాస్తులను రైతు స్వయంగా వెళ్లి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఆగస్టు 5వ తేదీలోగా అందజేయాలి. మార్పు చేర్పుల కోసం ఇంతకుముందు నమోదు చేసుకున్న రైతులు ఎవరైనా సవరణలు ఉంటే తేదీ 30- 07-2024 లోపు సరి చేసుకోవాలి. ప్రమాదవశాత్తు నామిని చనిపోయిన, కొత్త నామిని మార్పు కోసం వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. అలాగే పట్టాదారు పుస్తకం ఉండి ఇంతకుముందు నమోదు చేసుకొనని రైతులు కూడా పూర్తి వివరాలతో సంబంధిత ఆయా గ్రామ ఏఈవో ను సంప్రదించాలి.