స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – భీంగల్
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అబ్బా చిరంజీవి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అకౌంట్ అండ్ ట్యాక్స్  ఫెర్, చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, హాస్పిటల్ మేనేజ్ మెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫార్మసీ అసిస్టెంట్ తదితర కోర్సులలో అందుబాటులో ఉన్నాయని కనుక ఆసక్తిగల యువకులు 79893 36007 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.