అతిథి ఉపాధ్యాయ పోస్టుల నియమానికి దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్ద కోడప్ గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మహిళా అభ్యర్థుల నుంచి అతిథి ఉపాధ్యాయ పోస్టుల నియమకానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు గురువారం పత్రిక ప్రకటనలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునీత తెలిపారు.
ఇందులో భాగంగా పాఠశాలలో 2 టీజీటీ మ్యాథ్స్ మరియు 01 టీజీటీ సోషల్ మరియు  01 పీఈటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అభ్యర్థులు తగిన అర్హతతో కూడిన ధ్రువీకరణ పత్రలతో పాటు డెమో ద్వారా ప్రతిభ గల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.ఇట్టి డెమోను శుక్రవారం 11 గంటల సమయం నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 3:00 వరకు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చెప్పిన మహిళా ఉపాధ్యాయులకు తగిన ప్రాధాన్య ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.