నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
బంగారిగూడ తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, కళాశాలలో పొలిటికల్ సైన్స్ పోస్టు ఖాళీని గంటల భోదన ప్రతిపాదికన నియమించుటకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి. రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్ది పొలిటికల్ సైన్స్ పీజీటీ కోసం ఎం.ఏ పొలిటికల్ సైన్స్, బీఈడీ పూర్తి చేసి ఉండాలని సూచించారు. బుధవారం నుండి ఈనెల 22వ తేదీ వరకు తమ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు..