మైనార్టీ గురుకులంలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల బాలుర నిజామాబాద్ లో జెఎల్ఇంగ్లీష్, టీజీటీ సోషల్, స్టాఫ్ నర్స్ పోస్టులకు తగిన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు తగిన ధృవపత్రాలతో పాఠశాల పని దినములలో సంప్రదించాలని సూచించారు. ఇతర సందేహాల కోసం ఫోన్ నెంబర్ 94917444748 ను సంప్రదించాలన్నారు.