ఖాళీ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – పెద్ద కొడప్ గల్
మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిన ఖాళీల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసు కోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ నళిని ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిన ఖాళీల ప్రవేశం కొరకు ఆన్లైన్లో రూ.100 చెల్లించి సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 27వ తేది నుంచి జూలై 12వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాటశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఆయా పాఠశాలలకు బదిలీ కోరుకునే వారు ఆన్లైన్లో రూ.100 చెల్లించి సంబంధిత వెబ్సైట్ ద్వారా ఈ నెల 27 నుంచి జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వివరించారు.