
పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు బోధించడానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ ధన వేణి శనివారం తెలిపారు. పీహెచ్డీ నెట్ సెట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, ఈనెల 11 లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని, రాత పరీక్ష, డెమో ఇచ్చి అర్హులైన వారికి 19న ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఆసక్తిగల మహిళ అభ్యర్థిని లు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.