నైపుణ్యాభివృద్ధి కోర్సుల శిక్షకురాలిగా మహిళల నుండి దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ-రామగిరి 
2024-25 సంవత్సరానికి గాను  ఆర్ జి-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో నిర్వహించనున్న టైలరింగ్, మగ్గంవర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, జూట్ బ్యాగ్స్ తయారీ మొదలగు నైపుణ్యాభివృద్ధి కోర్సుల శిక్షకురాలుగా పనిచేయడానికి ఆసక్తి గల సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, పరిసర గ్రామాల మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  పర్సనల్ మేనేజర్ బి.సుదర్శనం ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తుతో పాటు సంబంధిత విభాగంలో అనుభవ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు జతచేసి రామగుండం-3 ఏరియా జీఎం కార్యాలయంలోని పర్సనల్ విభాగంలో  ఈనెల 10 తారీఖున సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని కోరారు. ఇతర వివరాలకై ఏరియా పర్సనల్ విభాగంలో సంప్రదించాలని తెలిపారు.