నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని కంజర్ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల విద్యాలయాల్లో 2024- 2025 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ పరీక్ష కొరకు విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జి. మాధవి లత సోమవారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు ఆదాయం 150,000 లోపుండాలని అలాగే పట్టణంలో కల విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలన్నారు. ఫిబ్రవరి 11న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందని విద్యార్థులు 100 రూపాయల రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు అలాగే విద్యార్థులు 2023- 24 విద్యా సంవత్సరము ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నవారు అర్హులుగా ఉంటారు. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు www.tswreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ప్రవేశ పరీక్ష కొరకు జనవరి 23- 01- 2024వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యం మరియు నాణ్యమైన భోజన వసతి అలాగే పోటీ పరీక్షల కొరకు ప్రత్యేక శిక్షనివ్వబడుతుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని కచ్చితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పేదరిక ప్రజలు కానీ వినియోగించుకోవాలని కోరుతున్నారు.