నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి ఆంధ్రయ్య, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగమణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో పని చేసేందుకు (నాన్ టీచింగ్) సిబ్బంది అసిస్టెంట్ కుక్, స్వీపర్ పోస్టులు ఖాళీ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. 7వ తరగతి అర్హత, అనుభవం ఉన్నవారు ఆసక్తి ఉంటే తగిన ధ్రువపత్రాలతో ఈనెల 21వ తేదీ నుండి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేతనం నెలకు రూ. 9750 అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో కోరారు.