నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్రంలోని అల్ప సంఖ్యాక వర్గాల వారు విదేశాలలో పై చదువుల నిమిత్తం“ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం” ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె జగదీశ్వర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 01జనవరి 2024 నుండి 31 జులై 2024 కాలంలో (స్ప్రింగ్ సీజన్) అడ్మిషన్ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్ధులు www.telanganaepass. cgg.gov.in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలి అని అన్నారు. విద్యార్ధుల తల్లితండ్రుల వార్షిక ఆదాయము రూ. 5 లక్షల లోపు ఉండాలని విద్యార్థిని విద్యార్థుల వయస్సు 35 సం. ల కు మించరాదు అని తెలిపారు. ఇట్టి పథకము క్రింద ఎంపిక చేయబడిన ప్రతి విద్యార్ధికి స్కాలర్ షిప్ క్రింద రూ. 20,00,000/-(ఇరవై లక్షలు) రెండు విడుతలలో చెల్లిస్తారని అలాగే విమాన ప్రయాణ చార్జీలు రూ. 60,000/-(అరవై వేలు) మించకుండా చెల్లించడం జరుగుతుంది అని తెలిపారు. దరఖాస్తుల ఆన్ లైన్ తేది 07.08.2024 సా. 5.00 గంటల వరకు నమోదు చేసుకోవాలి అని అన్నారు.ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులను మూడు జతల జిరాక్స్ ప్రతులను సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రూం నంబర్ ఎఫ్ –05 లో గల మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయములో సమర్పించాలని కోరారు. ఇతర పూర్తి వివరాలకు ఆన్ లైన్ వెబ్ సైట్ లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధికారి కార్యాలయము, సూర్యాపేట ఫోన్.9247720650 ,9492611057 నంబర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు.