నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదర్శ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పడిగెల దశరథ్ సోమవారం ఒక ప్రకటనలో వివరించారు ఈ పరీక్ష కోసం ఆన్లైన్ లో దరఖాస్తు లను 06 జనవరి 2025 నుండి ప్రారంభమైందని, చివరి తేదీ ఈ నేలా 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. 7’8’9’10 తరగతులకు మిగిలి ఉన్న సీట్లకు కూడా దరఖాస్తులు చేసుకోవాలని అన్ని తరగతులకు సంబంధించిన పరీక్ష 13 ఎప్రిల్ 2025 నాడు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ దశరథ్ కోరారు.