పార్ట్ టైమ్ టీచర్ దరఖాస్తుల ఆహ్వానం

– గురుకుల పాఠశాలల ప్రాంతీయ సమన్వకర్త నిర్మల
నవ తెలంగాణ – సిద్దిపేట
జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో తెలుగు, హిందీ,ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన, సాంఘిక, జంతు, వృక్ష , ఎకనామిక్స్, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, నర్స్ ,పి.ఇ.టి, లైబ్రేరియన్ బోధించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు గురుకుల పాఠశాలల ప్రాంతీయ సమన్వకర్త నిర్మల శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పీజీ, బీఈడీ , జి .ఎన్.ఎం , బి పిఈడ్, బి.ఎల్. ఐసి అర్హతలు కలిగి ఉండాలన్నారు. జూన్ 15న మిట్టపల్లి గురుకుల పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే డెమోకు హాజరు కావాల న్నారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
– సాంఘిక సంక్షేమ గురుకులాల్లో
ఇంటర్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం….
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్ రీజియన్ ఈస్ట్ సిద్దిపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకల ప్రాంతీయ సమన్వాయాధికారి నిర్మల కోరారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీ డియేట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీల భర్తీకి 2023 మార్చిలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్ సైట్ లో రూ. 100 రుసుం చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 15ను దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల వారి తల్లిదండ్రుల ఆధాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారి తల్లిదండ్రుల ఆధాయ రూ.2 లక్షలు ఉండాలన్నారు. ఈ ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాల వయస్సు నిండరాదన్నారు. విద్యా ర్థులు తమ ప్రవేశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.