నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లాలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు నడపబడుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యనికి తెలియజేయునది ఏమనగా ఎస్.సి. విద్యార్ధిని/విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద 2024-25 సంవత్సరమునకు, 1వ తరగతి (డే-స్కాలర్) 5వ తరగతి (రెసిడెన్సియల్) ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్చుటకు ఆసక్తి గల పాఠశాలల యాజమాన్యం నుండి ధరఖాస్తులు కోరడం జరుగుతుందని. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కే దయానందరాణి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు దిగువన పేర్కొన నియమాలకు లోబడి ఉండలని.ఈ ధరఖాస్తులు సమర్పించు చివరి తేది. ఈ నెల 15 వరకు ఉన్నది పూర్తి వివరాలకి జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి కార్యాలయము,రూం నెం.F3, మొదటి అంతస్తు, కలెక్టరేట్ భవన సముదాయం,యందు సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ హస్పటళ్లలో వసతులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి..జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు. నవ తెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్.ప్రభుత్వ హస్పటళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.గురువారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సిహెచ్ ప్రియాంకతో కలిసి మెడికల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి జిల్లాలోని అన్ని పిహెచ్‌సిలలో, సబ్సెంటర్లలో మాలిక వసతులు, అత్యవసరంగా కావాల్సిన పరికరాలు, కావలసిన వస్తువులను సమకూర్చాలని ఆఏశించారని, అందుకనుగుణంగా ప్రతిపాదనలు సత్వరమే సిద్దం చేసి అందిచాలని కలెక్టర్ సూచించారు. పిహెచ్‌సీలలో మీటిం హల్, డాక్టర్లు, స్టాఫ్ నర్సులకు విశ్రాంతి రూములు, ఇమునైజెషన్, వ్యాక్సిన్స్ నిల్వ ఉంచడానికి ఐఎల్ఆర్ రూమ్స్‌లను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలోని పీహెచ్సీ, సబ్ సెంటర్లు మొత్తం 61 సెంటర్లకు ఉపాధి హామి కాంపోనెంట్ నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శారద, డిఎం అండ్ హెచ్ ఓ కోటాచలం, జిజియస్ సూపర్డెంట్ మురళి ధర్ రెడ్డి, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు పీహెచ్సీ, సబ్ సెంటర్ల డాక్టర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.