దరఖాస్తులకు ఆహ్వానం..

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
విద్యా సంవత్సరం 2024 – 25 కు సంబంధించి జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు  బెస్ట్ అవెలబుల్ స్కీం క్రింద ఇంగ్లీషు మీడియం 1వ, తరగతి (డేస్కాలర్)  5వ, తరగతి (రెసిడెన్షియల్)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారాలను ఉప సంచాలకులు (షెడ్యూల్డు కులముల అభివృద్ధి) శాఖ, నల్లగొండ జిల్లా  కార్యాలయములో అందుబాటులో ఉంటాయని, పూర్తిచేసిన దరఖాస్తు ఫారం ను జూన్ 7వ తేదీ   సాయంత్రం 5 గంటల లోగా అందజేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే  విద్యార్ధుల కుటుంబ సభ్యులలో హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ నందుగాని, గతములో బెస్ట్ అవెలబుల్ స్కీం క్రింద గాని చదువుతున్నట్లు అయితే ధరఖాస్తు చేసుకునే  అవకాశం లేదని తెలిపారు. దీనికి సంబంధించిన జూన్ 11న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఉదయాదీత్య భవన్లో డ్రా తీసి విద్యార్థులు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. 1వ తరగతి యందు దరఖాస్తు చేసుకొనుటకు  1 జూన్2018 నుండి 31 మే2019 వరకు జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,50,000 లోపు గ్రామీణ ప్రాంతములలో నివసించే వారికి,  రూ. 2,00,000 లోపు పట్టణ ప్రాంతములలో నివసించే వారికి ఉండాలని,  1 ఏప్రిల్ 2024 తరువార మీ సేవా ద్వారా పొందిన   కుల, ఆదాయ,దృవికరణ  పత్రాలు, రేషన్ కార్డు, జనన దృవీకరణ,  ఆధార్ కార్డు, 2 పాస్ పోర్టుసైజ్ ఫోటోలతో దరఖాస్తు చేయాలని తెలిపారు. సూచించిన తేదీ అనంతరం వచ్చిన దరఖాస్తులను స్వీకరించబడదని స్పష్టం చేశారు.