దరఖాస్తులకు ఆహ్వానం..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
2024-25 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడు సంవత్సరాల శిక్షణ కొరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని యస్.సి. కులానికి చెందిన న్యాయవాద పట్టభద్రులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ ఈనెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ శిక్షణకు న్యాయ శాస్త్రములో డిగ్రీ ఉత్తీర్ణులై వారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ 2.00 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న ఎస్ సి అభ్యర్థులు అర్హులు అని తెలిపారు.శిక్షణ సమయంలో రూ 3,000 ల చొప్పున స్టైఫండ్. పుస్తకాల కొనుగోలుకు ఒకసారి మాత్రమే రూ.50,000/-లు చెల్లిస్తారని తెలిపారు. దరఖాస్తులను (https://telanganaepass.cgg.gov.in)ఆన్లైన్ నందు మాత్రమే చేసుకోవాలన్నారు.అభ్యర్థులు పూర్తి బయోడేటా తో పాటు ఈ సంవత్సరం కులం, ఆదాయం మీ సేవ ద్వారా పొందిన పత్రాలు, డిగ్రీ మార్కుల జాబితా బార్ కౌన్సిల్ నమోదు పత్రాలు జత చేసి జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ నల్లగొండ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.