కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి ఆహ్వానం 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ పద్ధతిలో 13 మిన్లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. దరఖాస్తులను ఈ నెల 6వ తేది నుంచి 9వ తేదీలోపు కలెక్టర్ కార్యాలయంలోని డీఎంహెచ్వో ఆఫీసూంనంబర్ 202లో అందజేయాలని సూచించారు. దరఖాస్తులను nizamabad.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.