నూతన భవనాల ప్రారంభోత్సవ ఆహ్వానము

– రెండు మూడు రోజుల్లో రానున్న మంత్రి సీతక్క
నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు శుక్రవారం, నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళా సంఘ భవనం, గ్రంథాలయం, బీసీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ డి అనసూయ అలియాస్ సీతక్క ను పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్ భీమగాని రాములు గౌడ్, గ్రామపంచాయతీ కార్యవర్గం ఆహ్వానించారు. రెండు మూడు రోజుల్లో వస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాల్నే వెంకటేష్, నమిలే నరేష్, సిపిఎం కార్యదర్శి కాల్నే స్వామి, మాజీ సర్పంచ్ బీమగాని మాధవి రాములు గౌడ్,  కాల్నే రాజు, సయ్యద్ చోటా మియా తదితరులు పాల్గొన్నారు.