రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. దరఖాస్తుల ఆహ్వానం

– మద్నూర్లో మూడు, డోంగ్లిలో ఒకటి, శాఖాపూర్ ఒకటి, డీలర్ పోస్టుల ఖాళీ..
నవతెలంగాణ – మద్నూర్
బాన్సువాడ డివిజనల్ పరిధిలోని ఆయా మండలాల్లో గల డీలర్ పోస్టుల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డీలర్ల పోస్టుల భర్తీ కోసం జారి అయిన నోటిఫికేషన్ కాపీని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పిఏ ద్వారా వాట్సాప్ గ్రూపులో జారీ చేయించారు. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలో ఆరు డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మద్నూర్ మండల కేంద్రంలో షాప్ నంబర్ 2 షాప్ నంబర్ నాలుగు షాప్ నంబర్ 5 అదేవిధంగా డోంగ్లి మండల కేంద్రంలో ఒకటి మద్నూర్ మండలంలోని షేకాపూర్ లో ఒకటి ఈ విధంగా ఆరు డీలర్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం అర్హులైన వారు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు గల వారు అర్హులుగా పేర్కొనడం జరిగింది. దరఖాస్తు ఫారం కోసం రూ.500 రూపాయలు చెల్లించి బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారాలు పొందవలసి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 18 నుండి ఈనెల 31 వరకు బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారాల గడువు అనంతరం ఆగస్టు 9న రాత పరీక్ష బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెలుగులో పరీక్ష ఉంటుంది. పరీక్ష అనంతరం ఆగస్టు 14న ఉదయం 10 గంటలకు బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన వారు డీలర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని బాన్స్వాడ్ ఆర్ డి ఓ ఆహ్వానించారు.