సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో చేరుటకు ఆహ్వానం

– సహాయ సాంఘిక సంక్షేమ అధికారి మల్లేశం
నవ తెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న 9 బాలుర, ఐదు బాలికల హాస్టల్లో చేరడానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి మల్లేశం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు హాస్టల్లో చేరవచ్చని అన్నారు. బాలురులకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో(సిద్దిపేట) 160, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ (దుబ్బాక) 150, చిన్నకోడూర్ లో 83, పాలమాకులలో 42, బెజ్జంకిలో 76, శనిగరంలో 66, దౌల్తాబాద్ లో 56, హుస్నాబాద్ లో 63, బాలికల కోసం ఆనంద నిలయం సిద్దిపేటలో 53, సిద్దిపేటలో 51, గట్ల మల్యాలలో 25, హుస్నాబాద్ లో 74, దుబ్బాకలో 100 సీట్లు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు నేరుగా హాస్టళ్లకు వచ్చి చేరవచ్చు అని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు సద్వినియం చేసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థికి నోట్ బుక్స్, పాఠశాల ద్వారా పాఠ్య పుస్తకాలు, బెడ్డింగ్ మెటీరియల్ (బెడ్ షీట్ అండ్ కార్పెట్ మరియు మంచాలు, కంచాలు, కటోరాలు, నాలుగు జతల బట్టలు, ఉలెన్ రగ్గులు, స్వెటర్స్, మంకీ క్యాప్స్, ప్రతినెల కాస్మెటిక్ చార్జెస్ ఇవ్వబడనని, డైనింగ్ టేబుల్ భోజన వసతి, ప్రతి నెల వైద్యులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడుననీ, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వబడుననీ, స్పోర్ట్స్ షూ, నార్మల్ షూ, పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9000019730 ను సంప్రదించాలని కోరారు.