సమాచార హక్కు చట్టం సెమినార్ కు కుమార్ యాదవ్ కు ఆహ్వానం.

Invitation to Kumar Yadav for Right to Information Act Seminar.నవ తెలంగాణ మల్హర్ రావు.
హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో రెండు రోజుల పాటు నిర్వహించే సమాచార హక్కు చట్టం రాష్ట్ర స్థాయి సెమినార్ వర్క్ షాపుకు మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త,చింతల కుమార్ యాదవ్ కు ఆహ్వానం అందింది.ఈ మేరకు ఈనెల 21, 22వ తేదీల్లో నిర్వహించే “PROACTIVE DISCLOUSER OF INFORMATION UNDER RTI ACT” అనే వర్క్స్ షాపు లో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులతో పాటు ఆర్టిఐ,ఆక్ట్వీస్ట్ లకు నిర్వహించే సెమినార్ లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ పంపిన లేఖలో పేర్కొన్నారు. కాగా భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ నుండి రాష్ట్ర స్థాయి వర్క్స్ షాపు సెమినార్ కు ఆహ్వానం అందడం పట్ల పలువురు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు