హైదరాబాద్ : రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజ రామయ్యర్‌ను భారత హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శనపల్లి జగన్‌మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం సచివాలయంలోని కార్యాలయంలోని ఆమెని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్‌లో గోవాలో జరుగనున్న జాతీయ క్రీడలకు హ్యాండ్‌బాల్ సంఘం తరఫున శైలజ రామయ్యర్‌ను ఈ సందర్భంగా జగన్ ఆహ్వానించారు.