రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర వికలాంగులశాఖ సంచాలకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు తమ దరఖాస్తులను డిసెంబర్‌ 10 లోపు ఆన్‌లైన్‌ ద్వారా తమ ధరఖాస్తులను సమర్పించాలని సూచించారు.