మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 22న గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరవ్వాలని కోరుతూ బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానాన్ని హైదరాబాదులోని తమ నివాసంకు వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మాజీ సర్పంచులు బూడిద లింగయ్య యాదవ్ , తాటికొండ సైదులు, మండల గొల్ల కురుమ సభ్యులు సాగర్ల లింగస్వామి , తీర్పారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.