
మండలంలోని పలు గ్రామాలలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణం డీలర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల రెవెన్యూ అధికారి బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో వెలగనూర్, బంజాపల్లి, జక్కాపూర్ గ్రామాలలో రేషన్ పంపిణీ డీలర్ ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తిగల సభ్యులు దరఖాస్తులకు 18 జూలై నుండి 31 జులై వరకు రెవేన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయం బాన్సువాడ నందు రూ 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని. ఎంపిక విధానం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందని తెలిపారు. కనీస విద్యా అర్హత పదవ తరగతి పాసై ఉండాలని ఆయన తెలిపారు. రాత పరీక్ష 9 ఆగస్టు 11 గంటల నుండి 1 గంటల వరకు ఎస్ఆర్ఎన్కె ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ నందు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు మండల రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.