త్వరలోనే ఐఓసి భవనం ప్రారంభం

నవతెలంగాణ-జగదేవపూర్‌
అన్ని అంగులతో నూతన సమీకత మండల కార్యాలయ సముదాయ భవనంను రాష్ట్ర వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌ రావు చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించుకుంటామని ఎంపీపీ బాలేశం గౌడ్‌ బుధవారం తెలిపారు. జగదేవపూర్‌ మండల కేంద్రంలో సుమారుగా రూ.10 కోట్లు ప్రహరీకి మరికొన్ని నిధులతో ఐ ఓ సి భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతు చివరి దశకు చేరుకున్నాయన్నారు. భవనంలో రంగులు కరెంట్‌ పనులు భవనం చూట్టు ప్రహరీ నిర్మాణం పనులు నడుస్తున్నాయన్నారు. మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చెస్తూన్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్‌ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యా లయాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. మండలాల్లోని ఐఓసి నూతన భవనాలను వారం పది రోజుల్లోనే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.