ఫ్రాన్స్‌లో ఐఫోన్‌ 12 నిషేధం..!

న్యూఢిల్లీ : ఆపిల్‌కు చెందిన ఐఫోన్‌ 12ను ఫ్రాన్స్‌ దేశం నిషేధించింది. ఆ ఫోన్‌లో యూరోపియన్‌ యూనియన్‌ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎలక్ట్రోమాగటిక్‌ రేడియేషన్‌ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఇటీవలే ఐఫోన్‌ 12 విక్రయాలు నిలిపివేయాలని ఆపిలను ఫ్రాన్స్‌ ఆదేశించింది. కాగా.. తమ ఫోన్‌ను అనేక కఠిన పరీక్షల తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేశామని ఆపిల్‌ పేర్కొంది. ఫ్రాన్స్‌ బాటలోనే ఐఫోన్‌ 12పై తాజాగా బెల్జియం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఫోన్‌ రేడియేషన్‌పై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై ఆపిల్‌ను డచ్‌ కూడా వివరణ కోరింది.