– మే 25న ఐపీఎల్ టైటిల్ పోరు
– రానున్న మూడు సీజన్ల విండో వెల్లడి
ముంబయి : గతంలో ఎన్నడూ లేని విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రానున్న మూడు సీజన్ల ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) షెడ్యూల్ విండోను వెల్లడించింది. పది ప్రాంఛైజీలకు రాసిన లేఖలో బీసీసీఐ టోర్నమెంట్ తేదీలను తెలిపింది. మార్చి 14న ఐపీఎల్ 2025 ఆరంభం కానుండగా.. మే 25న ఫైనల్ జరుగుతుంది. 2026 ఐపీఎల్ మార్చి 15న మొదలై.. మే 31న ముగియనుంది. 2027 ఐపీఎల్ మార్చి 24న ప్రారంభమై.. మే 30న ఫైనల్‌తో ముగుస్తుంది. 2026, 2027 సీజన్ల మ్యచుల సంఖ్యపై స్పష్టత లేకపోయినా.. వచ్చే సీజన్లో సైతం 74 మ్యాచులే ఉండనున్నాయి. ఇక వచ్చే మూడు ఐపీఎల్ సీజన్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టీండీస్, అఫ్గనిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల క్రికెట్ బోర్డుల తమ ఆటగాళ్లకు ఎన్‌ఓసీలు అందించినట్టు బోర్డు వెల్లడించింది.