– ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ను తొలి 15 మ్యాచులకు మాత్రమే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ అనంతరం ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నారు.’ఐపీఎల్ 17 పూర్తిగా భారత్‌లోనే జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మార్చి 22న తొలి మ్యాచ్‌కు ప్రణాళిక సిద్ధం చేశామని’ అరుణ్ ధుమాల్ తెలిపారు. మే 26న ఐపీఎల్ 17 టైటిల్ పోరు షెడ్యూల్ చేసే అవకాశం కనిపిస్తుంది.