ధర్మశాల : 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ కుమార్ ధుమాల్ తెలిపారు. వచ్చే ఏడాది ఐపీఎల్ సమయంలో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయంలో క్రికెట్ మ్యాచులకు భద్రత కల్పించటం కష్టతరం అవుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.