– క్వాలిఫయర్1, ఎలిమినేటర్‌కు ఆతిథ్యం
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్లే ఆఫ్స్‌లో తొలి రెండు మ్యాచులకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్‌లో ఆది నుంచి పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం గత సీజన్ రన్నరప్ సొంత మైదానంలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులు నిర్వహిస్తారు. గత సీజన్ చాంపియన్ సొంత మైదానంలో ఆరంభ, ఫైనల్ మ్యాచులు సహా క్వాలిఫయర్ 2 ఉంటుంది. 2024 ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ విజేతగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచాయి. మార్చి 21న కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభ వేడుకలు సహా తొలి మ్యాచ్ ఉండనుంది. మే 25న ఈడెన్‌గార్డెన్స్‌లోనే ఫైనల్ సహా ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. 2025 ఐపీఎల్‌లో 74 మ్యాచులు షెడ్యూల్ చేయగా.. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫిబ్రవరి 7న ఆరంభం కానుండగా.. ముంబయి, బెంగళూర్‌తో పాటు బరోడ, లక్నోలో మ్యాచులు నిర్వహించనున్నారు.