లైవ్‌ టెస్టింగ్‌ క్యాప్సుల్‌తో రాకెట్‌ ప్రయోగించిన ఇరాన్‌

టెహ్రాన్‌: అంతరిక్షంలోకి వ్యోమ గాములను పంపడానికి ప్రణాళికలు రచిస్తున్న ఇరాన్‌ తాజాగా టెస్ట్‌ లివిం గ్‌ స్పేస్‌ క్యాప్సుల్‌తో రాకెట్‌ను ప్రయో గించింది. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ తస్నిమ్‌ ప్రకటిం చింది. బుధవారం గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించినట్లు వెల్లడించింది.
ఈ క్యాప్సూల్‌ 130 కిమీ ఎత్తు వరకూ చేరుకుందని తెలిపింది. రెండు కోతులను అంతరిక్షంలోకి పంపి వాటిని మళ్లీ సురక్షితంగా భూమి మీదకు తీసుకొని వచ్చిన ప్రయోగం నిర్వహించిన పదేళ్ల తరువాత ఇరాన్‌ మళ్లీ ఈ రాకెట్‌ ప్రయోగం జరిపింది.