జాతీయస్థాయిలో సత్తా చాటిన ఐరిస్ విద్యార్థులు 

నవతెలంగాణ – బొమ్మలరామారం
జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఐరిస్ విద్యార్థులు సత్తా చాటారు. ఇటువలె మధురై లో జరిగిన జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్ పోటీల్లో బొమ్మలరామారం మండలంలో యావపూర్ ఐరిస్ విద్యార్థులు రోలర్ స్కేటింగ్ పోటీలో విద్యార్థులు సత్తా చాటి విజేతలుగా నిలిచారు.2 బంగారు పతకం,14 రజత 09 కాంస్య పతకంలను సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ రుద్ర లక్ష్మి,డైరెక్టర్ R P సేత్ అభినందించారు. అనంతరం ప్రిన్సిపల్ రుద్ర లక్ష్మి మాట్లాడుతూ.ప్రస్తుతం ఉన్న జనరేషన్ పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి రోలర్ స్కేటింగ్,ఒక వైపు చదువులో ఒకవైపు ఆటల్లో సత్తా చాటిన ఐరిస్ విద్యార్థులేని విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.