బాసర సూసైడ్ స్పాట్ లో ఇనుప కంచెకై మంత్రికి వినతి..

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని యంచ గోదావరి సూసైడ్ స్పాట్ వద్ద ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని సర్పంచ్ కొట్టాల లహరి ప్రవీణ్ మంత్రి ప్రశాంత్ రెడ్డికి బుధవారం జిల్లా కేంద్రంలో విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన ఎసిపి కిరణ్ కుమార్ తో చర్చించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు.