నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లాలో జూన్ మూడో వారంలో జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులలో వివిధ రకాల అక్రమాలు బయటకు వస్తున్నాయని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా బాధ్యులు పి శాంతన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతి అక్రమాలు పగడ్బందీగా చేపట్టినట్టు బయటపడుతున్న అక్రమాలను చూస్తే అర్థమవుతుంది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులకు అలట్ జరిగిన పాఠశాలల జాబితాను పాఠశాల డైరెక్టర్ కార్యాలయం నుండి జూన్ 18న ఎక్సెల్ (XL)రూపంలో జాబితాలు అన్ని జిల్లాల విద్యాశాఖలకు చేరిన మాదిరిగానే నిజామాబాద్ జిల్లాకు కూడా పై జాబితాలు చేరినవి. దాదాపు అన్ని జిల్లాలలో జూన్ 18 ననే పాఠశాల డైరెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన జాబితాలు వచ్చినట్టుగానే జిల్లాలలో ప్రకటించగా అందుకు భిన్నంగా జిల్లా విద్యాశాఖ అధికారి చేతివాటం ప్రదర్శించి సీనియర్లకు అలాట్ అయిన ప్రాధాన్యత గల పాఠశాలలను జూనియర్లకు కేటాయించడం, సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతికి అర్హత ఉన్న ఉపాధ్యాయులను పక్కనపెట్టి వారి తర్వాతి డీఎస్సీ వారికి పదోన్నతి ఇచ్చిన సంఘటనలు కూడా బయట పడుతున్నాయి అని అన్నారు.
మొదట తక్కువ మంది ఉపాధ్యాయులతో జాబితా వెలువరించి మరో రెండు రోజులకు మరో నాలుగురు, ఐదుగురు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని బేరసారాలకు దిగి రెండు రోజుల అనంతరం మరో జాబితాను విడుదల చేయడం ద్వారా డీఈఓ అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే పైన పేర్కొన్న అక్రమాలకు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఎంచుకున్న ఏకైక మార్గం స్కానింగ్, ఎడిటింగ్ ప్రక్రియ అని ఎక్సెల్ ఫైలుని ఎడిట్ చేయడం సాధ్యం కాదు, కానీ ఆ ఫైలును ఎడిట్ చేయాలంటే స్కాన్ యాప్ ద్వారా పదోన్నతి జాబితాలను డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసే అవకాశం డీఈవో తీసుకోవడం ద్వారా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన మొత్తం 853 మంది పదోన్నతుల జాబితాలు అన్నింటిని క్యాంప్ స్కాన్ ద్వారా ఎడిట్ చేసినవే అనే విషయం ఉపాధ్యాయ సంఘాలు గుర్తించి పాఠశాల డైరెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది అని అన్నారు. ఎడిట్ చేసిన ఒక పదోన్నతి జాబితాను పరిశీలిద్దాం. బయోలాజికల్ సైన్స్ లోకల్ బాడీ తెలుగు మీడియంలో వెబ్ కౌన్సిలింగ్ కు 38 ఖాళీలను చూపెట్టడం జరిగింది. అందులోనే అర్హతలు గల ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా కూడా అప్లోడ్ చేయబడింది . పదోన్నతుల ఆప్షన్స్ అనంతరం 38 మందితో పదోన్నతి జాబితా పాఠశాల డైరెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన జాబితాను యధాతతంగా ప్రదర్శించకుండా వక్ర బుద్ధితో అతి తెలివిగా (పాఠశాల డైరెక్టర్ లీగల్ వింగ్ లో పూర్వం పనిచేసిన అనుభవం)కామ్ స్కాన్ యాప్ లోకి జాబితాను మార్చుకొని ఎడిట్ చేసుకొని మొదట 33 మంది పదోన్నతి జాబితాను విడుదల చేయడం జరిగింది. ఆమెరకు ఉపాధ్యాయులు 18న పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలల నుండి విడుదలై పదోన్నతి పాఠశాలలో మరుసటి రోజు జూన్ 19న సంబంధిత హెడ్మాస్టర్లకు, ఎంఈఓ లకు రిపోర్ట్ చేసి జాయిన్ అయినారు.
అంటే వాస్తవంగా 38 పదోన్నతులకు బదులు 33 జాబితా బయటపెట్టి మిగతా ఐదుగురికి పదోన్నతులు రాలేవని వారికి పదోన్నతి కల్పించేందుకు పెద్ద మొత్తం డబ్బులు ఆశించి పైరవీ కారులు కొందరిని రంగంలోకి దించి ఒక్కొక్కరి నుండి లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడి రెండు రోజుల అనంతరం మరో నలుగురి పేర్లను పదోన్నతి జాబితాకు ఆడ్ చేసి మొత్తం 37 మంది జాబితాను రెండు రోజుల అనంతరం జూన్ 20న జిల్లా విద్యాశాఖ అధికారి విడుదల చేయడం జరిగింది అని అన్నారు. ఈ జాబితాలో చోటు దక్కవలసిన 33 ఎస్టి రోస్టర్ పాయింటును కూడా లేకుండా ఆ పాయింట్ పై పదోన్నతి కల్పించబడిన వ్యక్తికి కూడా పదోన్నతి రాలేదని కావలసినంత దండుకొని 37 జాబితాకు సంబంధం లేకుండా అతనికి ప్రత్యేకంగా ఉత్తర్వులు వెలువరించి మొదటి జాబితాలో ఉన్న పాఠశాలను (యుపిఎస్ కొత్తపల్లి) పాఠశాలకు బదులు జెడ్ పిఎస్ఎస్ ఏర్గట్లకు పదోన్నతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి 37 జాబితానే సరైనది అంటున్న జాబితాలో విజయ్ కుమార్ పేరు ఎందుకు లేదు. దీనికి డీఈవో సమాధానం చెప్పాల నీ,. ఇక 33 జాబితాలో రోస్టర్ 9 గల టి . శైలజ అనే ఉపాధ్యాయురాలికు జెడ్పిహెచ్ఎస్ ధర్పల్లి అలట్ కాగా 37 జాబితాలో రోస్టర్ 5 గా మార్చి సదరు ఉపాధ్యాయురాలికి జెడ్పిహెచ్ఎస్ కొండూరు అలట్ చేయడం జరిగింది. మరో ఉపాధ్యాయురాలు (ఏ. రాధ ) 33 జాబితాలో జెడ్ పిఎస్ఎస్ కల్లూరు కు బదులు 37 జాబితాలో జెడ్పిఎస్ఎస్ చౌటుపల్లి కి మార్చడం జరిగింది. మరో ఉపాధ్యాయుడు డి. శ్రీను కు 33 జాబితాలో జడ్పీహెచ్ఎస్ కొండాపూర్ అలట్ కాగా ఇతనికి 37 జాబితాలో యుపిఎస్ కొత్తపల్లికి, (కోటగిరి మండలం) ఏ. అంజమ్మ 33 జాబితాలో రోస్టర్ 38 ఇచ్చి జెడ్పిహెచ్ఎస్ తాళ్లరాంపూర్ అలట్ జరగగా ఈమెకు 37 జాబితాలో రోస్టర్ 32 గా చూపి జెడ్పిఎస్ఎస్ ధర్పల్లికి మార్చడం జరిగింది. ఈ పాఠశాల అత్యంత ప్రాధాన్యత( డిమాండ్ )గల, పాఠశాలలో ఒకటి ఐదవ రోస్టర్ నుండి 31 వరకు ప్రాధాన్యత ఆప్షన్లో పెట్టుకున్న ఎవరికి దక్కని జడ్పీహెచ్ఎస్ ధర్పల్లి పాఠశాల ఈమెకు కేటాయించడం వెనుక లక్షల రూపాయలు చేతులు మారినవి అని అన్నారు.
రెండవ జాబితా ప్రకారం మోడిఫికేషన్ జరిగిన అందరూ ఉపాధ్యాయులు మళ్లీ తమ పూర్వ పాఠశాలకు, లేదా ఎంఈఓ వద్దకు వచ్చి మొదట విడుదలైన పాఠశాల స్థానంలో రెండవసారి మోడిఫికేషన్ అయిన పాఠశాలలకు విడుదల ఉత్తర్వులు పొందడం జరిగింది. అయితే ఇలా మోడిఫికేషన్ జరిగిన ఉపాధ్యాయులు మొదటి రిలీవింగ్ ఆర్డర్ ద్వారా ఆయా పాఠశాలలో రెండు రోజులు పనిచేసి చెప్పా పెట్టకుండా క్యాన్సిలేషన్ ఉత్తర్వులు లేకుండానే సంబంధిత హెడ్మాస్టర్ కు సమాచారం ఇవ్వకుండానే ఎటువంటి క్యాన్సిలేషన్ ఉత్తర్వులు లేకుండానే రెండవ మోడిఫికేషన్ స్థానానికి రిలీవింగ్ ఆర్డర్ పొందడంలో సంబంధిత హెడ్మాస్టర్లు ఎంఈఓ లు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం పట్ల డిఇఓ మౌఖిక ఆదేశాలే కారణమని తెలుస్తుంది అని అన్నారు. ఈ క్రమంలో మౌఖిక ఆదేశాలు పాటించిన జడ్పీహెచ్ఎస్ కొండూరు ప్రధానోపాధ్యాయుడు రెండవ జాబితా పదోన్నతి ఉపాధ్యాయురాలు టీ. శైలజ ను జూన్ 21న విధులలో చేర్చుకొని జూన్ 19న మొదటి జాబితా ప్రకారం ఈ పాఠశాలలో జాయిన్ అయిన కె. పద్మజా గారిని వెళ్లిపోవాలని రిలీవ్ చేయకుండా పాఠశాల నుండి వెళ్లిపోవాలని ఆదేశించడం అక్రమమని, తను సరైన కారణాలు లేకుండా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా వెళ్లేది లేదని అదే పాఠశాలలో గత నెల 19 నుండి అక్కడే పని చేస్తుంది .హెడ్మాస్టర్ మాత్రం ఈమెను ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లో సంతకాలు పెట్టనీయకుండా వేధించడంతో, సొంతంగా హాజరు రిజిస్టర్ ఏర్పాటు చేసుకొని పాఠశాలకు హాజరైన రోజులలో సంతకాలు చేస్తూ తన పట్ల హెడ్మాస్టర్ వహిస్తున్న నిర్లక్ష్యంపై ఈమె, జిల్లా విద్యాశాఖ అధికారికి, జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రెండు రోజుల క్రితం ఆర్జెడి వరంగల్ కు పాఠశాల డైరెక్టర్ కు కూడా తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడం జరిగింది అని అన్నారు. అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే. ఇదిలా ఉండగా సదురు ఉపాధ్యాయురాలు నిన్నటి రోజు అసిస్టెంట్ డైరెక్టర్ కె లింగయ్య కలిసి తన సమస్యను విన్నవించుకోగా తనకు పాఠశాల మారలేదని కొండూరులోనే మీకు పదోన్నతి ఉన్నదని కొండాపూర్ పాఠశాల అక్రమమని తేల్చిన విషయం నేడు ప్రధాన చర్చనీయాంశం.
అంటే డిఇఓ అక్రమాలను అసిస్టెంట్ డైరెక్టర్ లింగయ్య కూడా ధ్రువీకరించినట్లయిoది. ఎటువంటి క్యాన్సిలేషన్ ఉత్తర్వులు లేకుండా రెండవసారి రిలీవ్ చేయడం అభ్యంతరకరమని ఎంఈఓ లు, ప్రధానోపాధ్యాయులు గ్రహించకపోవడం గమనార్హం. అయితే ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎంఈఓ లు హెడ్మాస్టర్ లపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ కామ్ స్కాన్ మోడిఫికేషన్ వ్యవహారం ఇలా ఉంటే 33 జాబితాకు 37 జాబితాకు అదనంగా చేర్చబడిన ఐదుగురి ఉపాధ్యాయుల వద్ద (37 జాబితాలో ఒకరిని విస్మరించిన దానిని ”విజయ్ కుమార్”” కలుపుకుంటే) దండిగా దండుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి మరో అక్రమానికి తీరలేపడం జరిగింది. . ఆర్మూర్ పట్టణంలోని కమల్ నెహ్రూ కాలనీ లో పనిచేసే ఉపాధ్యాయురాలు ఏ. వనజ, డీఎస్సీ 2000 కాగా ఈమెను పక్కనపెట్టి 2001 డిఎస్సి వారికి ముగ్గురికి పదవులు కట్టబెట్టడం జరిగింది. ఈమెకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతి కల్పించబడి ఉంటుంది. ఇది విచారణలో తేలె అంశం. అయితే జిల్లా విద్యాశాఖ అధికారి కామ్ స్కాన్ ద్వారా అక్రమ ఎడిటింగ్ కు శ్రీకారం చుట్టడం ఈ ఒక్క సబ్జెక్టుకే పరిమితం కాలేదు, దాదాపు అన్ని సబ్జెక్టులలో ఏదో ఒక రకమైన మాడిఫికేషన్లు అంటే సీనియర్ ఉపాధ్యాయుల అలాట్మెంట్ పాఠశాలలను జూనియర్ ఉపాధ్యాయులకు మార్చడం జరిగినవి అని అన్నారు. పదోన్నతులు ఇచ్చిన 853లో 100 పైగా అక్రమ మాడిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. అక్రమాలు జరిగావా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క బయోసైన్స్ తెలుగు మీడియం లోకల్ బాడీ జాబితాను డైరెక్టర్ కార్యాలయం వెలువరించిన జాబితాతో సరిపోల్చితే జరిగిన అక్రమాలు బహిర్గతం కాగలవు. ఇలా కామ్ స్కాన్ స్కాం కు సిద్ధపడే డిఇఓ ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా అన్ని జిల్లాలలో ఆయా జిల్లాల డీఈవో వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఫైనల్ వేకెన్సీ, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను అప్లోడ్ చేయకుండా నిర్లక్ష్యం వహించడం కామ్ స్కాన్ స్కాంలో భాగoగా ఉపాధ్యాయులు అనుమానిస్తున్నారు. కావున ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారిని_తక్షణమే సస్పెండ్ చేసి కం స్కాం పై సమగ్ర విచారణకు ఆదేశించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ తరపున విద్యాశాఖ ఉన్నతాధికారుల ను కోరినారు.